yakub
రచయిత
అణు బెదిరింపులకు భారత్ కౌంటర్: పాక్ ఆర్మీ చీఫ్‌కు MEA తిప్పికొట్టింది
yakub
రచయిత
అణు బెదిరింపులకు భారత్ కౌంటర్: పాక్ ఆర్మీ చీఫ్‌కు MEA తిప్పికొట్టింది

పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అమెరికాలో భారతపై చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తీవ్రంగా స్పందించింది. అణ్వాయుధాలతో బెదిరించడం పాకిస్తాన్‌కు పాత అలవాటు అని, ఇలాంటి వ్యాఖ్యలు అంతర్జాతీయంగా బాధ్యతారాహిత్యంగా ఉంటాయని MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు. అణు బాంబుతో బెదిరించడంపై భారత్ గట్టిగా స్పందించిందని, జాతీయ భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే, అమెరికాతో మంచి సంబంధాలున్న పాక్ నేతలు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం అని వ్యాఖ్యానించారు. అసిమ్ మునీర్ మాట్లాడుతూ – పాకిస్తాన్ అణ్వస్త్రాలు కలిగిన దేశమని, తమను ఆపడానికి ప్రయత్నిస్తే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ హెచ్చరించారు. అంతేకాదు, సింధు నదిపై భారత్ ఆనకట్ట నిర్మిస్తే దాన్ని క్షిపణితో ధ్వంసం చేస్తామని కూడా వ్యాఖ్యానించారు.