R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుర్తింపు వివరాలు సవరించుకునే అవకాశం
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుర్తింపు వివరాలు సవరించుకునే అవకాశం

ఇందిరమ్మ హౌసింగ్ పథకానికి సంబంధించిన లబ్ధిదారుల ఆధార్ కార్డుల్లో పొరపాట్లు ఉన్నవారు ఇప్పుడే సవరణలు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు హౌసింగ్ సెక్రటరీ & కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ కలెక్టర్లకు సర్క్యులర్ జారీ చేశారు.లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలు ఆధార్‌తో లింక్ కాలేదటం, లేదా రెండు ఆధార్ కార్డుల్లోని వివరాలు పొంతన లేకపోవడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 శాతం (సుమారు 9 వేల మంది) లబ్ధిదారులకు చెల్లింపులు నిలిచిపోయాయని అధికారులు గుర్తించారు.భవిష్యత్‌లో డీబీటీ (Direct Benefit Transfer) కింద నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఆధ్వర్యంలో ఆధార్ పేమెంట్ బ్రిడ్జ్ సిస్టం (APBS) ద్వారా నిధులు పంపిణీ చేయనున్న నేపథ్యంలో, ఆధార్ వివరాలను సరిచేయాల్సిన అవసరం ఉందని సెక్రటరీ సూచించారు.
ట్యాగ్‌లు
LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi