Lahari
రచయిత
మధ్యప్రదేశ్‌లో అమానుష ఘటన: గిరిజన మహిళపై గ్యాంగ్‌రేప్, ఇనుపరాడ్‌తో హింస
Lahari
రచయిత
మధ్యప్రదేశ్‌లో అమానుష ఘటన: గిరిజన మహిళపై గ్యాంగ్‌రేప్, ఇనుపరాడ్‌తో హింస

మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన దారుణ ఘటన స్థానికులను మరియు దేశవ్యాప్తంగా ప్రజలను షాక్‌కు గురిచేసింది. 45ఏళ్ల గిరిజన మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి, ఆమె మర్మాంగాల్లో ఇనుప రాడ్‌తో హింసించి, తీవ్రంగా గాయపరిచారు. తీవ్ర రక్తస్రావంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించి హరి పాల్వి, సునీల్ ధుర్వే అనే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వివాహ వేడుకకు హాజరైన బాధితురాలు, మద్యం సేవించిన తరువాత ఇద్దరు నిందితులతో పాటు ఉండగా ఈ ఘటన జరిగింది. ఉదయం తీవ్ర గాయాలపై అపస్మార స్థితిలో ఆమెను గుర్తించారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించకపోవడంతో, మధ్యాహ్నం లోపే ఆమె మరణించారు. పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం, అత్యాచారం అనంతరం ఆమె ప్రైవేట్ భాగాల్లో ఇనుప రాడ్ చొప్పించడంతో తీవ్రమైన అంతర్గత గాయాలు వచ్చాయని వైద్యులు తెలిపారు. చనిపోయే ముందు కొద్దిసేపు స్పృహలోకి వచ్చిన ఆమె, “సునీల్, హరి చేశారని” చెప్పినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.