Lahari
రచయిత
థానేలో అమానుష ఘటన: బాలికలపై monthlies తనిఖీలు, 8 మందిపై కేసు
Lahari
రచయిత
థానేలో అమానుష ఘటన: బాలికలపై monthlies తనిఖీలు, 8 మందిపై కేసు

మహారాష్ట్ర థానే జిల్లా షాహాపూర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో అమానవీయ ఘటన జరిగింది. బడిలోని బాత్రూంలో నెలసరి రక్తపు మరకలు కనిపించటంతో, అందుకు బాధ్యులెవరనేదీ తెలుసుకునేందుకు పాఠశాల సిబ్బంది షాకింగ్ చర్యలు చేపట్టారు. 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న విద్యార్థినులందరినీ హాల్‌లోకి తేచి, ఇద్దరు గ్రూపులుగా విడగొట్టి, నెలసరిలో ఉన్నవారిపై శారీరక తనిఖీలు చేపట్టారు. బాలికల ప్రైవేట్ పార్ట్స్‌ను ముడుతూ మహిళా అటెండెంట్ తనిఖీ చేయడం బాలికల్లో భయాందోళన కలిగించింది. ఈ ఘటనపై తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, మహిళా అటెండెంట్ సహా 8 మందిపై BNS సెక్షన్ 74, 76తో పాటు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం principalను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.