A
ashok
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ర్యాష్ డ్రైవింగ్ చేస్తే ఇన్సూరెన్స్ వర్తించదు: సుప్రీం కోర్టు
A
ashok
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ర్యాష్ డ్రైవింగ్ చేస్తే ఇన్సూరెన్స్ వర్తించదు: సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ: అతివేగం, నిర్లక్ష్యంతో వాహనం నడిపి మృతి చెందినట్లయితే, బాధిత కుటుంబానికి ఇన్సూరెన్స్ పరిహారం ఇవ్వలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ పీఎస్ నరసింహ, ఆర్ మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం వెల్లడించిన ఈ తీర్పులో, ఒక వ్యక్తి 2014లో కారు ప్రమాదంలో మరణించగా, అతని భార్య వేసిన రూ.80 లక్షల పరిహార దరఖాస్తును తిరస్కరించింది. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన వ్యక్తికి చట్టపరంగా పరిహారం వర్తించదని పేర్కొంది. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడమే ప్రమాదానికి కారణమని తెలిపింది. ఇలాంటి సందర్భాల్లో బీమా కంపెనీలు బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని ఈ తీర్పుతో స్పష్టం అయింది.
ట్యాగ్‌లు
TrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthitrending news