L

Lahari

రచయిత

1 నిమిషాలు చదవడానికి

చాట్‌జీపీటీ సేవల్లో అంతరాయం – యూజర్ల ఫిర్యాదులతో సోషల్‌ మీడియా హాట్‌టాపిక్

చాట్‌జీపీటీ సేవల్లో అంతరాయం – యూజర్ల ఫిర్యాదులతో సోషల్‌ మీడియా హాట్‌టాపిక్

చాట్‌జీపీటీ సేవల్లో అంతరాయం – యూజర్ల ఫిర్యాదులతో సోషల్‌ మీడియా హాట్‌టాపిక్

ఓపెన్‌ఏఐ చాట్‌బాట్‌ చాట్‌జీపీటీ సేవల్లో తాత్కాలిక అంతరాయం తలెత్తింది. భారత్‌ సహా ప్రపంచ వ్యాప్తంగా యూజర్లు యాప్‌, వెబ్‌ ద్వారా యాక్సెస్ చేయడంలో సమస్యలను ఎదుర్కొన్నారు. కొందరు లాగిన్‌, నెట్‌వర్క్‌ ఎర్రర్‌లను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం సమయంలో ఎక్కువగా ఇబ్బందులు ఎదురైనట్లు డౌన్‌డిటెక్టర్‌ రిపోర్ట్ చేసింది. భారత్‌లోనే 500కిపైగా ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ సమస్యపై యూజర్లు ఎక్స్‌లో #ChatGPTDown అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. 2022 చివర్లో విడుదలైన చాట్‌జీపీటీ, క్షణాల్లో సమాధానాలు అందించగల సామర్థ్యంతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది వాడుతున్న విషయం తెలిసిందే.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi