Lahari
రచయిత
స్టోక్స్ స్పోర్టివ్ స్పిరిట్ ఇదేనా? మాంచెస్టర్ టెస్ట్‌పై విమర్శలు
Lahari
రచయిత
స్టోక్స్ స్పోర్టివ్ స్పిరిట్ ఇదేనా? మాంచెస్టర్ టెస్ట్‌పై విమర్శలు

ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ప్రవర్తనపై మాంచెస్టర్ టెస్ట్ తరువాత తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత్ బ్యాటర్లు జడేజా, వాషింగ్టన్ సుందర్ సెంచరీల దిశగా సాగుతుండగా, స్టోక్స్ వారిని వ్యంగ్యంగా ప్రశ్నిస్తూ స్లెడ్జింగ్‌కు దిగాడు. “బ్రూక్ బౌలింగ్‌లో సెంచరీ చేస్తావా?” అని జడ్డూకు వ్యాఖ్యలు చేయడం, తర్వాత ఫుల్‌టాస్‌లు వేయించడం, బౌలింగ్‌ను తేలికగా తీసుకున్నట్లు చూపించడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోరాడే ప్రత్యర్థిని చిన్నచేయడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని పలువురు అభిమానులు విమర్శించారు. మ్యాచ్ అనంతరం కూడా స్టోక్స్ భారత ఆటగాళ్లతో సాధారణ అభివాదం చేయకుండా పోవడం గమనార్హం. తన ఆటను ప్రశంసించేందుకు అభిమానులున్నారు కానీ, ఆటపై గౌరవం చూపించని తీరు కొంతమందిలో నిరాశను కలిగిస్తోంది. ఈ వ్యవహారం నేపథ్యంలో సోషల్ మీడియాలో స్టోక్స్‌పై "రెస్పెక్ట్ డౌన్" కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.