ashok
రచయిత
మీ ఖాతా హ్యాక్ అయిందా? ఈ ఉచిత టూల్స్‌తో వెంటనే తెలుసుకోండి!
ashok
రచయిత
మీ ఖాతా హ్యాక్ అయిందా? ఈ ఉచిత టూల్స్‌తో వెంటనే తెలుసుకోండి!

డిజిటల్ ప్రపంచంలో సైబర్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో, ఖాతాలు హ్యాక్ అయాయో లేదో తెలుసుకోవడం ఎంతో అవసరం. ఇందుకు గూగుల్, ఆపిల్ వంటి సంస్థలు కొన్ని ఉచిత టూల్స్ అందిస్తున్నాయి. 🔹 గూగుల్ పాస్‌వర్డ్ చెకప్ మీ పాస్‌వర్డ్‌లలో బలహీనతలుంటే, లేదా అవి లీక్ అయి ఉంటే గూగుల్ చెప్తుంది. అలాగే వాటిని మార్చమని సూచిస్తుంది. 🔹 గూగుల్ వన్ డార్క్ వెబ్ రిపోర్ట్ మీ పర్సనల్ డేటా డార్క్ వెబ్‌లో లీక్ అయిందో లేదో తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను ఉపయోగించేందుకు Google One మెంబర్‌షిప్ అవసరం. 🔹 ఆపిల్ కీచైన్ మానిటరింగ్ ఐఫోన్ లేదా మ్యాక్ వాడేవారికి ఇది ఉపయోగపడుతుంది. బలహీనమైన లేదా తిరిగి వాడిన పాస్‌వర్డ్‌లను హెచ్చరిస్తుంది. 🔹 భద్రతకు సాధనాలు ప్రతి ఖాతాకు వేర్వేరు బలమైన పాస్‌వర్డ్ ఉపయోగించండి. 2FA ఆన్ చేయండి. అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించేందుకు తరచూ లాగిన్ హిస్టరీ, యాక్సెస్ చేసిన పరికరాలను తనిఖీ చేయండి. గమనిక: మీ పాస్‌వర్డ్ కనీసం 12 అక్షరాల పొడవులో ఉండాలి. పెద్ద అక్షరాలు, చిన్న అక్షరాలు, అంకెలు, స్పెషల్ కేరెక్టర్స్ కలిపి ఉండాలి. ఇలా ఉంటే మీ ఆన్‌లైన్ భద్రత బలపడుతుంది.