Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా – ప్రధాని మోదీ స్పందన
Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా – ప్రధాని మోదీ స్పందన

ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. ఆరోగ్య కారణాలతో వైద్యుల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సోమవారం రాత్రి రాష్ట్రపతికి రాజీనామా లేఖ పంపగా, ద్రౌపదీ ముర్ము దానిని ఆమోదించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ స్పందిస్తూ – ధన్‌ఖడ్ సేవలను ప్రశంసించారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఇదివరకు బెంగాల్ గవర్నర్‌గా పని చేసిన ధన్‌ఖడ్, 2022లో ఉపరాష్ట్రపతిగా ఎన్నికై, 528 ఓట్లతో రికార్డు విజయాన్ని సాధించారు. మరో రెండేళ్లు పదవీకాలం మిగిలుండగానే రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన మూడో వ్యక్తిగా ధన్‌ఖడ్ చరిత్రలో నిలిచారు.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi