Y

yakub

రచయిత

1 నిమిషాలు చదవడానికి

జగిత్యాల: మెట్‌పల్లిలో గోదాములో భారీ అగ్నిప్రమాదం

జగిత్యాల: మెట్‌పల్లిలో గోదాములో భారీ అగ్నిప్రమాదం

జగిత్యాల: మెట్‌పల్లిలో గోదాములో భారీ అగ్నిప్రమాదం

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌లో పౌరసరఫరాల శాఖ గోదాంలో వచ్చిన అగ్ని ప్రమాదం 24 గంటలు గడిచినా అదుపులోకి రాలేదు. గోదాములో 2018 నుంచి నిల్వ ఉన్న సుమారు తొమ్మిది లక్షల గన్ని సంచులు దగ్దమవుతున్నాయి. మంటల తీవ్రతతో పక్కనే ఉన్న శాంతినగర్ కాలనీ ప్రజలు భయంతో ఉన్నారు. మంటలను ఆర్పేందుకు నాలుగు వైపులా గోడలు కూల్చి, పలు ప్రాంతాల నుంచి అగ్నిమాపక వాహనాలను రప్పించి నీటి తో చల్లుతున్నారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ స్థలాన్ని పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చారు. గన్ని సంచులు అధికంగా ఉండటంతో మంటలు అదుపులోకి రావడం గడ్డు పరిస్థితిగా మారింది. ముందు జాగ్రత్తగా పోలీసు వాహనాలు, అంబులెన్సులు సంఘటన స్థలంలో సిద్ధంగా ఉంచారు.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi