R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

హరిహర వీరమల్లు విజయానికి జనసేన సమష్టి కృషి

హరిహర వీరమల్లు విజయానికి జనసేన సమష్టి కృషి

హరిహర వీరమల్లు  విజయానికి జనసేన సమష్టి కృషి

పవన్ కల్యాణ్ నటించిన "హరిహర వీరమల్లు" సినిమాను విజయవంతం చేయాలనే సంకల్పంతో జనసేన నేతలు, కార్యకర్తలు విశేషంగా కృషి చేస్తున్నారు. ఒక్కసారి కాదు, పలు మార్లు సినిమాను చూసి, అవసరమైతే ఇతరులకు కూడా టికెట్లు కొనిచ్చి చూపించాలని జనసైనికులకు నాయకులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ నేతలు నాదెండ్ల మనోహర్, హరిప్రసాద్, కందుల దుర్గేశ్ పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లా నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించగా, ఆ సంభాషణ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైసీపీ తరఫున పవన్ కల్యాణ్ సినిమాపై నెగిటివ్ ప్రచారం జరుగుతుందంటూ నాదెండ్ల మనోహర్ అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్ ఇమేజ్‌ను దెబ్బతీయాలనే కుట్రలు కొనసాగుతుండగా, పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయనకు బలంగా నిలవాలని పిలుపునిచ్చారు. సినిమా నుంచి వచ్చే ఆదాయాన్ని రాజకీయాల్లో వినియోగించిన పవన్ కష్టాన్ని వృథా చేయకూడదని, పార్టీ ఆర్థిక స్వావలంబన కోసం ఇది అవసరమని నేతలు స్పష్టం చేశారు. గ్రామ స్థాయిలోనూ, మండల, జిల్లా స్థాయిలోనూ కూటమి నేతల సహకారంతో ప్రచారం జోరుగా కొనసాగించాలని సూచించారు.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi