R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

జన్మాష్టమి సంబరాలు.. కానీ 2025లో శ్రీకృష్ణుడి ఎన్నో పుట్టినరోజులంటే తెలుసా?

జన్మాష్టమి సంబరాలు.. కానీ 2025లో శ్రీకృష్ణుడి ఎన్నో పుట్టినరోజులంటే తెలుసా?

జన్మాష్టమి సంబరాలు.. కానీ 2025లో శ్రీకృష్ణుడి ఎన్నో పుట్టినరోజులంటే తెలుసా?

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉత్సాహం వెల్లివిరుస్తోంది. మథుర, వృందావన్‌లో ఇప్పటికే వేడుకలకు రంగం సిద్ధమైంది. ఈ ఏడాది (2025) జన్మాష్టమి ఆగస్ట్ 16 రాత్రి నుంచి 17 ఉదయం వరకు జరుపుకుంటున్నారు. అయితే శ్రీకృష్ణుడు నిజంగా పుట్టింది ఎప్పుడు? అసలైన పుట్టినరోజు ఏది? అన్నది ప్రతి ఏడూ ఒక సందేహంగా మిగిలిపోతూ వస్తోంది.వాస్తవానికి చంద్రమానం ప్రకారం ప్రతి ఏడాది భాద్రపద కృష్ణ అష్టమి రోజు రాత్రి 12 గంటల సమయానికి శ్రీకృష్ణుడు జన్మించాడని పురాణాల చెబుతున్నాయి. అయితే సూర్యమాన చంద్రమాన భేదాల వల్ల ప్రతి ఏడూ ఈ తేది మారుతూ ఉంటుంది. అందుకే "కృష్ణుడు ఒక్కరే అయినా, పుట్టినరోజులు ఎన్నో" అనే మాట వినిపిస్తుంది.కృష్ణాష్టమి రోజు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ఉరియడి (ఉట్టి కొట్టడం), చిన్నారులను బాలకృష్ణులా ముస్తాబు చేయడం వంటి ఆనందభరితమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉత్తరాదిలో దీన్ని దహీ హండీ అనే పేరుతో పెద్ద ఉత్సవంగా నిర్వహిస్తారు. పెరుగు, పాల, మిఠాయిలతో కూడిన మట్టికుండను ఎత్తుగా తాడుతో కట్టి, యువతలు సమిష్టిగా దానిని పగలగొట్టే ప్రయత్నం చేస్తారు. ఇది బాలకృష్ణుని వెన్నదొంగగా చేసిన అల్లరిని గుర్తు చేస్తుంది.

ట్యాగ్‌లు

LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi