L

Lahari

రచయిత

1 నిమిషాలు చదవడానికి

నిరుద్యోగులకు డీఈఈటీ యాప్‌ ద్వారా ఉద్యోగ అవకాశాలు

నిరుద్యోగులకు డీఈఈటీ యాప్‌ ద్వారా ఉద్యోగ అవకాశాలు

నిరుద్యోగులకు డీఈఈటీ యాప్‌ ద్వారా ఉద్యోగ అవకాశాలు

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్‌ఛేంజ్ ఆఫ్ తెలంగాణ (డీఈఈటీ) అనే యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతో కలిసి రూపొందించిన ఏఐ ఆధారిత ప్లాట్‌ఫారం. ఈ యాప్‌ ద్వారా ఉద్యోగ ఖాళీల సమాచారాన్ని నేరుగా యువతకు చేరుస్తారు. రిజిస్ట్రేషన్ చేసిన వారికి వారి విద్యార్హతలకు అనుగుణంగా నోటిఫికేషన్లు పంపిస్తారు. మౌఖిక పరీక్షలు, రాత పరీక్షల వివరాలు ఫోన్‌కి వచ్చేస్తాయి. దరఖాస్తు చేయాలంటే www.tsdeet.com వెబ్‌సైట్‌లో లేదా గూగుల్ ప్లే స్టోర్‌లో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసి, వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు నమోదు చేయాలి. మధ్యవర్తుల అవసరం లేకుండా, నేరుగా కంపెనీల నుంచి అవకాశాలు అందేలా ఈ యాప్‌ ఉపయోగపడుతుంది.

ట్యాగ్‌లు

LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi