Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
కపిల్ శర్మ కేఫ్‌పై కాల్పులు – నిర్వాహకుల స్పందన
Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
కపిల్ శర్మ కేఫ్‌పై కాల్పులు – నిర్వాహకుల స్పందన

బాలీవుడ్ కమెడియన్ కపిల్ శర్మ ప్రారంభించిన కెనడాలోని ‘కాప్‌స్ కేఫ్’ పై ఖలిస్థానీ ఉగ్రవాది హర్జిత్ సింగ్ లడ్డీ కాల్పులకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. బుధవారం రాత్రి కారులో వచ్చిన దుండగుడు తొమ్మిది రౌండ్లు కాల్పులు జరిపాడు. అయితే అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడలేదు. ఈ ఘటనపై కేఫ్ నిర్వాహకులు స్పందిస్తూ, ‘‘హింసను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించము, శాంతియుత వాతావరణం కోసమే కేఫ్ ప్రారంభించాం’’ అని పేర్కొన్నారు. సంఘటనపై విచారణను పోలీసులు ప్రారంభించారు. బ్రిటిష్ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో ఇటీవలే ఈ కేఫ్‌ను ప్రారంభించారు, కొద్దిరోజుల్లోనే దాడి జరగడం గమనార్హం. ఈ ఘటనపై వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేఫ్‌ను మద్దతుగా నిలిచిన వారికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi