yakub
రచయిత
వన్డేలకు సిద్ధమవుతున్న కోహ్లీ – లండన్‌లో ప్రాక్టీస్ ప్రారంభం
yakub
రచయిత
వన్డేలకు సిద్ధమవుతున్న కోహ్లీ – లండన్‌లో ప్రాక్టీస్ ప్రారంభం

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్‌కి మళ్లీ సిద్ధమవుతున్నారు. టెస్ట్ మరియు టీ20లకు గుడ్‌బై చెప్పిన అనంతరం, వన్డే ఫార్మాట్ కోసం ఆయన ప్రాక్టీస్ ప్రారంభించారు. ప్రస్తుతం లండన్‌లోని ఓ ఇండోర్ స్టేడియంలో గుజరాత్ టైటన్స్ కోచ్ నయీమ్ అమిన్‌తో కలిసి ఆయన శిక్షణలో పాల్గొంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోను కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ, “సోదరా, నీ సహాయం కోసం ధన్యవాదాలు” అని రాశారు. ఫొటోలో కోహ్లీ ఫిట్‌గా కనిపించగా, తెల్లగడ్డతో ఉన్న లుక్ కూడా చర్చనీయాంశమవుతోంది. వచ్చే అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో భారత్ వన్డే సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో కోహ్లీ తన ప్రాక్టీస్ మొదలుపెట్టడం విశేషం. కాగా, కోహ్లీ చివరిసారిగా జూన్‌లో ఐపీఎల్ ఫైనల్‌లో బరిలో దిగారు. ఆ మ్యాచ్‌లో బెంగళూరు టైటిల్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు కోహ్లీ 302 వన్డేల్లో 14,181 పరుగులు, 51 సెంచరీలతో అద్భుతమైన రికార్డును సొంతం చేసుకున్నారు. అభిమానులు అతన్ని 2027 వరల్డ్‌కప్ వరకు భారత్ తరఫున ఆడతాడని ఆశిస్తున్నారు.