A

ashok

రచయిత

1 నిమిషాలు చదవడానికి

వరంగల్ వివాదంపై మీనాక్షికి నివేదిక ఇచ్చిన కొండా దంపతులు

వరంగల్ వివాదంపై మీనాక్షికి నివేదిక ఇచ్చిన కొండా దంపతులు

వరంగల్ వివాదంపై మీనాక్షికి నివేదిక ఇచ్చిన కొండా దంపతులు

హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసిన కొండా మురళి, సురేఖ దంపతులు, ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయ పరిణామాలపై 16 పేజీల నివేదికను అందించారు. నియోజకవర్గాలవారీగా అభిప్రాయాలను తెలిపిన వారు, తమపై వచ్చిన ఆరోపణలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, "ఇప్పటి వరకు నేను ఎలాంటి తప్పూ చేయలేదు. నియమాల ప్రకారమే పని చేస్తున్నాను. నా శాఖల్లో ఉన్న ఫైళ్లను పరిశీలించవచ్చు" అని అన్నారు. కుమార్తె సుష్మిత రాజకీయ ఆలోచనలపై కూడా స్పందించారు. కొండా మురళి మాట్లాడుతూ, "నేను బీసీ వర్గానికి చెందినవాడిని. ప్రజల సమస్యల పరిష్కారమే నా ధ్యేయం. పార్టీ మాకు అవకాశమిస్తే, గెలుపు బాధ్యత మా మీదే" అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పునరుత్థానమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఇప్పటికే వరంగల్‌లో కొండా వర్సెస్ ఇతర నేతలు అనే వివాదం కొనసాగుతుండగా, ఇరు వర్గాల మధ్య పిర్యాదులు, సమాధానాలు కొనసాగుతున్నాయి.

ట్యాగ్‌లు

TrendingKranthi NewsKranthi News Telugukrtv kranthitrending newswarangal