Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తివేత – నాగార్జునసాగర్ వైపుగా కృష్ణమ్మ ప్రవాహం
Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తివేత – నాగార్జునసాగర్ వైపుగా కృష్ణమ్మ ప్రవాహం

శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలతో వరద నీరు భారీగా వచ్చి చేరడంతో అధికారులు క్రస్ట్ గేట్లు ఎత్తారు. దీంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ నాగార్జునసాగర్ వైపు ప్రవహిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆనకట్టపై కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి, పసుపు కుంకుమతో పాటు చీరలను సమర్పించారు. అనంతరం గేట్లు 6, 7, 8, 11ల ద్వారా నీటిని లాంఛనప్రాయంగా విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయానికి సుంకేశుల, జురాల ప్రాజెక్టుల నుంచి రోజుకి 1.70 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. పూర్తి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 882 అడుగులు. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News TeluguAndhrapradeshkrtv newskrtv kranthitelangana