Lahari
రచయిత
కేటీఆర్ ఫైర్: వరదలు ముంచెత్తుతుంటే.. మూసీ సుందరీకరణ సమీక్షనా?
Lahari
రచయిత
కేటీఆర్ ఫైర్: వరదలు ముంచెత్తుతుంటే.. మూసీ సుందరీకరణ సమీక్షనా?

రాజన్న సిరిసిల్లలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. రాష్ట్రం వరదల్లో చిక్కుకుపోతుంటే, ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం మాత్రం మూసీ సుందరీకరణ సమీక్షలు, ఒలింపిక్ చర్చలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. "ప్రస్తుతం పంట, ఆస్తి, ప్రాణ నష్టం ఎంత జరిగిందో తెలుసుకోవడం ముఖ్యం. కానీ ప్రభుత్వం అజాగ్రత్తగా వ్యవహరిస్తోంది. కేసీఆర్ హయాంలో వరదల్లో చిక్కుకున్నవారిని హెలికాప్టర్లతో రక్షించాం. కానీ ఇప్పుడు రాష్ట్ర హెలికాప్టర్లు ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నాయి. చివరికి ఎన్డీఆర్ఎఫ్ సహకారంతోనే ప్రజలు కాపాడబడ్డారు" అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అలాగే పంట నష్టానికి ఎకరానికి రూ.25 వేల పరిహారం, ప్రాణ నష్టం జరిగిన కుటుంబాలకు రూ.25 లక్షలు, కూలిపోయిన ఇండ్ల స్థానంలో ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం సహాయక చర్యలు చేపడతామని, పార్టీ నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా సేవలందిస్తున్నారని కేటీఆర్ తెలిపారు.