A

ashok

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ఫ్యాన్సీ నంబర్ కోసం లక్షలు ఖర్చు – వరంగల్‌లో రికార్డు ధర!

ఫ్యాన్సీ నంబర్ కోసం లక్షలు ఖర్చు – వరంగల్‌లో రికార్డు ధర!

ఫ్యాన్సీ నంబర్ కోసం లక్షలు ఖర్చు – వరంగల్‌లో రికార్డు ధర!

ఫ్యాన్సీ నంబర్ కోసం వాహనదారులు లక్షలు వెచ్చించేందుకు వెనుకాడటం లేదు. వరంగల్‌ ఆర్టీఏ కార్యాలయంలో జరిగిన వేలంలో 9999 నంబర్ రూ. 11.09 లక్షలు పలికింది. కనీస ధర రూ. 50 వేలు కాగా, నాలుగుగురు పోటీపడగా, చివరికి హర్ష్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ TG 24 A 9999 నంబర్‌ను సొంతం చేసుకుంది. గతంలో ఖైరతాబాద్‌లో ఇదే నంబర్ రూ. 19 లక్షలకూ అమ్ముడైన నేపథ్యంలో, ఫ్యాన్సీ నంబర్ల craze ఇంకా తగ్గలేదని ఈ వేలం మరోసారి నిరూపించింది. ఈ భారీ మొత్తం చూసి చాలా మంది "అంత డబ్బు వెచ్చించి నంబర్ కొనడంలో లాభమేంటి? కొత్త కారు తీసుకున్నా చాలదా?" అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా ఫ్యాన్సీ నంబర్ల పట్ల క్రేజ్‌ వల్ల ప్రభుత్వానికి లక్షల రూపాయల ఆదాయం సమకూరుతోంది.

ట్యాగ్‌లు

TrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthitrending newstelangana