yakub
రచయిత
అలిపిరి వద్ద చిరుత పులి సంచారం.. భయాందోళనలో భక్తులు
yakub
రచయిత
అలిపిరి వద్ద చిరుత పులి సంచారం.. భయాందోళనలో భక్తులు

తిరుమల తిరుపతి మార్గంలో భక్తులను భయాందోళనకు గురిచేస్తూ మరోసారి చిరుత పులి అలిపిరి వద్ద ప్రత్యక్షమైంది. గురువారం తెల్లవారుజామున 5:30 ప్రాంతంలో అలిపిరి జూ పార్క్ సమీపంలోని ఇనుపకంచె దాటి రోడ్డుపైకి వచ్చింది. చిరుత సంచారం ఓ ప్రైవేట్ కంటి ఆసుపత్రి వరకు కొనసాగినట్లు గుర్తించబడింది. రోడ్డు పక్కన చిరుతను చూసిన భక్తులు భయంతో పరుగులు తీయగా, కొంతమంది తమ మొబైల్ ఫోన్లలో దృశ్యాలను చిత్రీకరించారు. వెంటనే వారు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా, వారు అక్కడకు చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల్లో చిరుత పులి కదలికలు నమోదు కావడంతో దానిపై చర్యలు ముమ్మరం చేశారు. ఇటీవల తిరుమల నడక దారుల వద్ద చిరుతలు కనిపిస్తున్న నేపథ్యంలో భక్తుల్లో ఆందోళన నెలకొంది. అటవీ శాఖ అధికారులు చిరుత సంచారాన్ని నియంత్రించి భక్తుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.