A

ashok

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ఆర్‌సీఐలో చిరుతపులుల సంచారం..

ఆర్‌సీఐలో చిరుతపులుల సంచారం..

ఆర్‌సీఐలో చిరుతపులుల సంచారం..

హైదరాబాద్‌ శివార్ల బాలాపూర్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్‌ (RCI) పరిసరాల్లో చిరుతలు సంచరిస్తున్నాయన్న సమాచారం కలకలం రేపుతోంది. రెండు రోజుల క్రితం ఓ వాచ్‌మెన్‌ రెండు అడవి జంతువులను చూసినట్లు తెలిపాడు. అవి చిరుతలుగా అనుమానించి అటవీ శాఖను సమాచారం ఇచ్చారు. అటవీ శాఖ సిబ్బంది ఆర్‌సీఐలో తనిఖీలు నిర్వహించినా ఎలాంటి జాడ కనిపించలేదని తెలిపారు. ముందు జాగ్రత్తగా ఉద్యోగులు, స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు. RCI డిఫెన్స్ ల్యాబ్ స్కూల్ ప్రిన్సిపల్‌ తల్లిదండ్రులకు నోటీసులు పంపి పిల్లలను ఒంటరిగా బయటకు పంపకూడదని సూచించారు. అదే సమయంలో అవి చిరుతలేనా లేక వేరే జంతువులేనా అనే విషయంపై స్పష్టతకు ట్రాప్ కెమెరాలు, బోన్లు ఏర్పాటు చేశారు. పరిసర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్‌లు

LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthitrending newstelagnanahyderabad