R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

స్టాక్‌ మార్కెట్‌లో నష్టాలు: బ్యాంకింగ్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి

స్టాక్‌ మార్కెట్‌లో నష్టాలు: బ్యాంకింగ్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి

స్టాక్‌ మార్కెట్‌లో నష్టాలు: బ్యాంకింగ్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి

దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో మొదలైనప్పటికీ, రోజంతా మార్కెట్‌ ఊగిసలాటలో ఉండి చివరికి నష్టాలను మూటగట్టుకుంది. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లలో భారీ అమ్మకాలు మార్కెట్‌పై ప్రభావం చూపించాయి.ఫైనాన్షియల్‌, ఎఫ్‌ఎంసీజీ, రియల్టీ రంగాల్లోనూ అమ్మకాలు చోటుచేసుకున్నాయి. జులై నెలకు చెందిన ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదలకానుండటంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో అమెరికా-రష్యా మధ్య జరగనున్న చర్చల పైనా ప్రపంచ మదుపరుల్లో ఉత్కంఠ నెలకొంది.సెన్సెక్స్‌ గరిష్ఠంగా 80,997 పాయింట్లను తాకిన తర్వాత చివరికి 368 పాయింట్ల నష్టంతో 80,235 వద్ద ముగిసింది. నిఫ్టీ 97 పాయింట్లు కోల్పోయి 24,487 వద్ద స్థిరపడింది. రూపాయి మారకం విలువ డాలరుతో పోలిస్తే 87.71గా ఉంది.

ట్యాగ్‌లు

LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi