L

Lahari

రచయిత

1 నిమిషాలు చదవడానికి

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక

బంగాళాఖాతం వాయవ్య దిశలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది వచ్చే 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని అంచనా. దీని ప్రభావంతో ఇవాళ, రేపు ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ జారీ కాగా, శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు అనేక జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మత్స్యకారులు శుక్రవారం వరకు సముద్ర యాత్రలకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News TeluguAndhrapradeshkrtv newskrtv kranthi