A

ashok

రచయిత

1 నిమిషాలు చదవడానికి

థియేటర్లలో మహావతార్ నరసింహ ధాటీ – 5 రోజుల్లో రూ.29.35 కోట్లు కలెక్షన్లు!

థియేటర్లలో మహావతార్ నరసింహ ధాటీ – 5 రోజుల్లో రూ.29.35 కోట్లు కలెక్షన్లు!

థియేటర్లలో మహావతార్ నరసింహ ధాటీ – 5 రోజుల్లో రూ.29.35 కోట్లు కలెక్షన్లు!

సాదాసీదాగా రిలీజ్ అయినా, కంటెంట్‌తో మంత్రిముగ్దుల్ని చేస్తోంది ‘మహావతార్ నరసింహ’ సినిమా. కేవలం రూ.4 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, విడుదలైన ఐదు రోజుల్లోనే రూ.29.35 కోట్లు నెట్ కలెక్షన్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఫస్ట్ డే రూ.1.75 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ, రెండో రోజు రూ.4.6 కోట్లు, ఆదివారం రోజే భారీగా రూ.9.5 కోట్లు రాబట్టింది. సోమవారం రూ.6 కోట్లు, మంగళవారం రూ.7.5 కోట్లతో కలెక్షన్ల జోరు కొనసాగించింది. ప్రముఖ నటీనటులు లేకుండానే, పూర్తిగా యానిమేషన్ టెక్నిక్‌తో రూపొందిన ఈ చిత్రం చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంటోంది. mouth talk బలంతో థియేటర్లు హౌస్‌ఫుల్ అయ్యే పరిస్థితి. పురాణ నేపథ్యం, యానిమేషన్‌లో నరసింహ స్వామి స్వరూపాన్ని చూపించిన విధానం, క్లైమాక్స్‌లో వచ్చే భావోద్వేగాలు – ఇవన్నీ ప్రేక్షకుల్లో goosebumps రేకెత్తించాయనటానికి నిదర్శనం, థియేటర్లలో భక్తులు హారతులు ఇస్తుండటమే. పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’కు కూడా ప్రభావం చూపించినట్టు టాక్. పబ్లిసిటీ లేకుండానే విజయం సాధించిన ఈ చిత్రం, కంటెంట్‌తో విజయం సాధించవచ్చనే నమ్మకాన్ని మళ్ళీ చూపించింది.

ట్యాగ్‌లు

CinemaLatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthitrending news