R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

యశ్‌ "టాక్సిక్" మూవీ నుండి మాస్ అప్‌డేట్ భారీ యాక్షన్ షెడ్యూల్ కొనసాగుతుంది

యశ్‌ "టాక్సిక్" మూవీ నుండి మాస్ అప్‌డేట్ భారీ యాక్షన్ షెడ్యూల్ కొనసాగుతుంది

యశ్‌ "టాక్సిక్" మూవీ నుండి మాస్ అప్‌డేట్  భారీ యాక్షన్ షెడ్యూల్ కొనసాగుతుంది

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వస్తున్న టాక్సిక్ పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌గా మారింది. A Fairy Tale For Grown Ups అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ చిత్రం, యశ్ కెరీర్‌లో 19వ మూవీగా తెరకెక్కుతోంది. ఈ సినిమాను యాక్టర్-డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ తెరకెక్కిస్తుండగా, కేవీఎన్ ప్రొడక్షన్స్ పై వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా, హ్యూమా ఖురేషి, టారా సుటారియా, అక్షయ్ ఒబెరాయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా మేకర్స్ షేర్ చేసిన అప్‌డేట్ ప్రకారం, ప్రస్తుతం 45 రోజుల భారీ యాక్షన్ షెడ్యూల్ హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ జేజే పెర్రీ పర్యవేక్షణలో జరుగుతోంది. ఈ యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొంటున్న స్టంట్ మ్యాన్‌లు అంతా ఇండియన్లు కావడం విశేషం. ఇక ఈ సినిమాలో రుక్మిణి వసంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. కేజీఎఫ్ సిరీస్ తర్వాత యశ్ నుంచి వస్తోన్న ఈ ప్రాజెక్టుపై అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi