ritesh
రచయిత
లగ్జరీ లైఫ్ ట్రాప్‌లో మధ్యతరగతి భారతీయులు: సీఏ నితిన్ కౌషిక్ హెచ్చరిక
ritesh
రచయిత
లగ్జరీ లైఫ్ ట్రాప్‌లో మధ్యతరగతి భారతీయులు: సీఏ నితిన్ కౌషిక్ హెచ్చరిక

లగ్జరీ జీవితశైలిని ఆశిస్తూ అప్పుల ఊబిలోకి వెళ్లిపోతున్నారని, మధ్యతరగతి ప్రజలు తమ ఖర్చులపై జాగ్రత్తగా ఉండాలని సీఏ నితిన్ కౌషిక్ సూచించారు. ఈఎంఐలు, క్రెడిట్ కార్డుల వినియోగం పెరుగుతున్న నేపథ్యలో, దీర్ఘకాలికంగా ఇది ఆర్థిక భారం పెంచుతుందని హెచ్చరించారు.ఒక్క సంతకం పెట్టగానే లోన్ వస్తుందన్న భావన ప్రజల్ని మోసపెడుతుందని, కానీ repay చేయాలంటే ఎక్కువ మొత్తం వెచ్చించాల్సి వస్తుందని అన్నారు. ఉదాహరణగా, ₹25 లక్షల లోన్‌కు చివరికి ₹40–45 లక్షలు చెల్లించాల్సి వస్తుందన్నారు.లగ్జరీగా జీవించాలనే ఆశ వల్ల నెలకు ₹5,000 ఖర్చు చేయడం కన్నా అదే డబ్బును మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడితే 20 ఏళ్లలో ₹30 లక్షలుగా మారుతుందన్నారు. ఈఎంఐల లేని జీవితం అసలైన ఆర్థిక స్వేచ్ఛను ఇస్తుందన్నారు.ఇతరులను ప్రభావితం చేయాలనే ఉద్దేశంతో ట్రావెల్, షాపింగ్‌పై ఎక్కువ ఖర్చు చేయడం అనవసరం అని, ముఖ్యంగా యువత ఈ ట్రాప్‌లో ఇరుక్కుంటున్నారని ఆయన అన్నారు.