ritesh
రచయిత
మంత్రి సీతక్క నిర్లక్ష్యం.. ఊరు ఖాళీ చేసి వెళ్తున్న ప్రజలు
ritesh
రచయిత
మంత్రి సీతక్క నిర్లక్ష్యం.. ఊరు ఖాళీ చేసి వెళ్తున్న ప్రజలు

ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామాన్ని వరదలు మళ్లీ కబళించగా, ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో గ్రామస్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ఏడాది వరదల సమయంలో గ్రామానికి వెళ్లే వంతెన కూలిపోయినప్పటికీ ఇప్పటికీ పునఃనిర్మాణం చేపట్టలేదు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండాయి గ్రామం మరోసారి నీటమునిగింది. దాంతో భయంతో గ్రామస్థులు పక్కనే ఉన్న దొడ్ల గ్రామానికి వలస వెళ్తే, అక్కడ వారు ప్రవేశించనివ్వలేదు. చివరకు దాదాపు 30కి పైగా కుటుంబాలు అడవిలో గుడిసెలు వేసుకుని తలదాచుకుంటున్నారు. అయితే అటవీశాఖ అధికారులు కూడా అక్కడ నివాసానికి అనుమతించకపోవడంతో, వారు దిక్కుతోచని పరిస్థితిలో చిక్కుకుపోయారు. గ్రామ ప్రజలు మంత్రి సీతక్కపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏడాది కిందట జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదని, వంతెనను ఇప్పటికీ పూర్తి చేయలేదని ఆవేదన వెలిబుచ్చుతున్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల దగ్గరకు వచ్చి చిత్రాలు తీయడం తప్ప, వాస్తవ సమస్యలపై స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.