krtv
రచయిత
కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ: యూరియా కొరతపై స్పందన కోరుతూ విజ్ఞప్తి | krtvgroup
krtv
రచయిత
కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ: యూరియా కొరతపై స్పందన కోరుతూ విజ్ఞప్తి | krtvgroup

తెలంగాణలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో, రాష్ట్రానికి తగినంత యూరియా అందించాలని కేంద్రాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. యూరియా కొరతను ఎదుర్కొనడంలో తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా, కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు లేఖలు రాశారు.ఏప్రిల్ నుంచి జూన్ వరకు కేటాయించిన 5 లక్షల టన్నుల్లో 3.06 లక్షల టన్నులే రాష్ట్రానికి వచ్చాయని, 1.94 లక్షల టన్నుల లోటు ఉన్నట్లు తెలిపారు. జులైలో 1.60 లక్షల టన్నులు రావాల్సి ఉన్నా, అందులో 60% ఇంపోర్టెడ్ యూరియా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. నౌకల లభ్యత లేదని, సరఫరా ఆలస్యం అయ్యే అవకాశముందని మంత్రి వివరించారు. ఇంపోర్టెడ్ యూరియాకు తక్షణంగా నౌకల కేటాయింపుతో పాటు, ఆర్‌ఎఫ్‌సీఎల్ నుండి రాష్ట్రానికి స్వదేశీ యూరియా సరఫరా 60 వేల టన్నులకు పెంచాలని, అలాగే గత త్రైమాసికంలో తలెత్తిన లోటును భర్తీ చేసేందుకు అదనపు కోటా కేటాయించాలని కోరారు.