Y

yakub

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ధరాలీలో బురద వరద భీభత్సం

ధరాలీలో బురద వరద భీభత్సం

ధరాలీలో బురద వరద భీభత్సం

ఉత్తరాఖండ్‌లోని పర్వత ప్రాంతం ధరాలీ గ్రామం మెరుపు వరదలతో తీవ్ర నష్టం ఎదుర్కొంది. ఖీర్‌గఢ్‌ ప్రాంతంలో ఒకేసారి కురిసిన కుండపోత వర్షానికి నదీ ప్రవాహం ఊపిరాడకుండా పెరిగి, మట్టి కలిసి బురదగా మారి గ్రామం మీద పడ్డాయి. ఈ ప్రమాదంలో సుమారు 20-25 హోటల్స్‌, హోమ్‌ స్టేలు పూర్తిగా నశించాయి. ధరాలీ చార్‌ధామ్ యాత్రికులకు ప్రసిద్ధి, గంగోత్రికి సమీపంలో ఉండే హిమాలయ కొండ ప్రాంతం. హార్సిల్‌ లోయకు 6 కి.మీ. దూరంలో ఉండే ఈ ప్రాంతం యాపిల్ తోటలతో కూడా పర్యాటకులను ఆకర్షిస్తుంది. వర్షం తీవ్రతకు గ్రామం పాక్షికంగా మట్టిలో కలిసిపోయింది. క్లౌడ్ బరస్ట్ అనేది అతి తక్కువ సమయంలో కురిసే భారీ వర్షం. గడియలోపే 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైతే దాన్ని క్లౌడ్ బరస్ట్‌గా పరిగణిస్తారు. ఈ వరదతో వసతిగృహాలు ధ్వంసమై ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. అగస్టు 10 వరకు భారీ వర్ష సూచనను వాతావరణ శాఖ జారీ చేసింది.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi