Lahari
రచయిత
లావా నుంచి కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ – బోల్డ్ N1 5G
Lahari
రచయిత
లావా నుంచి కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ – బోల్డ్ N1 5G

భారత మార్కెట్లో లావా సంస్థ తన కొత్త బోల్డ్ N1 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్‌లో 6.75 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్‌రేట్, Unisoc T765 ప్రాసెసర్, 4GB RAM (+4GB వర్చువల్), 64/128GB స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. మెమొరీని 1TB వరకు విస్తరించుకునే వీలు ఉంది. కెమెరా విషయానికి వస్తే వెనుక 13MP, ముందు 5MP కెమెరాలు ఉన్నాయి. 5000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, బాక్స్‌లో 10W చార్జర్ అందిస్తున్నారు. ఫోన్‌లో Android 15 OS క్లీన్ వెర్షన్‌తో వస్తుంది. 2 ఏళ్ల వరకు Android అప్‌డేట్స్, 3 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ లభిస్తాయి. డ్యూయల్ 5G, WiFi, Bluetooth 5.0, USB Type-C, ఫింగర్ ప్రింట్ సెన్సార్, IP54 రేటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ధర విషయంలో 4GB+64GB మోడల్ రూ.7,499, 4GB+128GB మోడల్ రూ.7,999 గా నిర్ణయించారు. షాంపేన్ గోల్డ్, రాయల్ బ్లూ కలర్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో కొనుగోలు చేసే వారికి SBI కార్డుపై రూ.750 డిస్కౌంట్ లభించనుంది.

