L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఏపీలో కొత్త బార్ పాలసీ.. లైసెన్స్ ఫీజు తగ్గింపు
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఏపీలో కొత్త బార్ పాలసీ.. లైసెన్స్ ఫీజు తగ్గింపు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన బార్ పాలసీని ప్రకటించింది. ఇందులో భాగంగా బార్ లైసెన్స్ ఫీజును భారీగా తగ్గించింది. ఇకపై 50 వేల జనాభా ఉన్న పట్టణాల్లో రూ.35 లక్షలు, 50 వేల నుంచి 5 లక్షల జనాభా ఉన్న చోట రూ.55 లక్షలు, 5 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో రూ.75 లక్షలు మాత్రమే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా, లైసెన్స్ ఫీజును ఆరు వాయిదాల్లో చెల్లించే అవకాశం కల్పించారు. దరఖాస్తు ఫీజును రాష్ట్రవ్యాప్తంగా ఒకేలా రూ.5 లక్షలుగా నిర్ణయించారు. ఈ మార్పులు వ్యాపారులకు ఆర్థికంగా ఊరట కలిగించేలా ఉంటాయని ఎక్సైజ్ కమిషనర్ తెలిపారు.
ట్యాగ్‌లు
LatestKranthi NewsKranthi News TeluguAndhrapradeshkrtv newskrtv kranthi