R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

సైబర్ నేరగాళ్ల కొత్త మోసం: ఫేక్ నోటిఫికేషన్లపై జాగ్రత్త

సైబర్ నేరగాళ్ల కొత్త మోసం: ఫేక్ నోటిఫికేషన్లపై జాగ్రత్త

సైబర్ నేరగాళ్ల కొత్త మోసం: ఫేక్ నోటిఫికేషన్లపై జాగ్రత్త

హైదరాబాద్: 'ఈగల్ సెల్' పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారు. ఈగల్ యాంటీ నార్కోటిక్స్ యూనిట్‌లో హోంగార్డుల నియామకం కోసం ఫేక్ నోటిఫికేషన్‌ను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.నెలకు రూ.25-26 వేల జీతం, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని, 10వ తరగతి పాసైన వారు అర్హులని ప్రచారం చేస్తున్నారు. అయితే, ఇది పూర్తిగా అవాస్తవమని ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య స్పష్టం చేశారు. తెలంగాణ పోలీసు శాఖ లేదా ఈగల్ సెల్ నుండి ఎటువంటి నోటిఫికేషన్ విడుదల కాలేదని ఆయన తెలిపారు. ఇలాంటి మోసపూరిత ప్రకటనల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ట్యాగ్‌లు

LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi