R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
పిల్లల ఆధార్‌కు కొత్త మార్గదర్శకాలు
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
పిల్లల ఆధార్‌కు కొత్త మార్గదర్శకాలు

UIDAI 5 నుంచి 15 ఏళ్ల పిల్లలకు ఆధార్‌లో తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్స్ (MBU) చేయాలని సూచించింది. దీనికోసం దేశవ్యాప్తంగా స్కూళ్లలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది.స్కూల్ ఎడ్యుకేషన్ శాఖతో కలిసి UIDAI ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. UDISE+ యాప్ ద్వారా ఏ విద్యార్థులకు అప్‌డేట్ అవసరమో స్కూళ్లు గుర్తించగలవు. ఈ విధంగా సుమారు 17 కోట్ల పిల్లల ఆధార్ అప్‌డేట్స్ పూర్తి చేయడం లక్ష్యం.బయోమెట్రిక్ అప్‌డేట్ చేయకపోతే భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు, విద్యాసంబంధిత ప్రయోజనాలు పొందడంలో ఇబ్బందులు రావచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. అలాగే NEET, JEE, CUET వంటి పరీక్షలకు అప్లై చేసేటప్పుడు కూడా సమస్యలు తలెత్తే అవకాశముందని తెలిపారు.
ట్యాగ్‌లు
LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi