ashok
రచయిత
తెలంగాణలో కొత్త మద్యం పాలసీ త్వరలో..! ఫీజు పెంపుతో లక్షల కోట్ల ఆదాయం లక్ష్యం
ashok
రచయిత
తెలంగాణలో కొత్త మద్యం పాలసీ త్వరలో..! ఫీజు పెంపుతో లక్షల కోట్ల ఆదాయం లక్ష్యం

తెలంగాణ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని రూపొందించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా మద్యం దుకాణాల దరఖాస్తు ఫీజును రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచాలని నిర్ణయం తీసుకుంది. అలాగే, లైసెన్స్ గడువును రెండు ఏళ్ల నుంచి మూడేళ్లకు పెంచనుంది. ఈ పాలసీని స్థానిక సంస్థల ఎన్నికలకంటే ముందే అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దరఖాస్తుల ఫీజుల ద్వారా రూ.3,500 కోట్లు, అడ్వాన్స్ ఎక్సైజ్ ఫీజుల రూపంలో రూ.24 వేల కోట్లు రావచ్చని అంచనా వేస్తున్నారు. అంటే మొత్తం 30 రోజుల్లో 30 వేల కోట్లు ఆదాయం సాధ్యమవుతుందని అంచనా. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలు ఉండగా, హైదరాబాద్‌లో 690 షాపులు ఉన్నాయి. నవంబర్ 30తో ప్రస్తుతం ఉన్న లైసెన్సులు ముగియనుండగా, ఆగస్టులోనే లాటరీ ద్వారా కొత్త షాపుల కేటాయింపు జరిపేందుకు ఎక్సైజ్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. కొత్త పాలసీలో దుకాణ స్థలంపై నిబంధనలలో సడలింపులు వచ్చే అవకాశమున్నట్లు సమాచారం.