ashok
రచయిత
ఆగస్టు 1 నుంచి యూపీఐకి కొత్త నిబంధనలు
ashok
రచయిత
ఆగస్టు 1 నుంచి యూపీఐకి కొత్త నిబంధనలు

ఆగస్టు 1 నుంచి యూపీఐ సేవల్లో కొన్ని కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తాజాగా కొత్త రూల్స్‌ను ప్రకటించింది. ఇకపై ఆటోపే లావాదేవీలు నిర్ణీత సమయాల్లో మాత్రమే జరగనున్నాయి. రోజంతా ఎప్పుడైనా చెల్లింపులు జరిగే అవకాశానికి బ్రేక్ పడనుంది. సబ్‌స్క్రిప్షన్లు, EMIలు, బిల్లులు వంటి ఆటోపేమెంట్స్‌కి టైమ్ లిమిట్ విధించారు. తద్వారా యూపీఐపై ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించాలనే లక్ష్యంతో ఈ మార్పులు తీసుకొచ్చారు. అలాగే, రోజుకు గరిష్టంగా 50 సార్లు మాత్రమే యూపీఐ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకునే అవకాశముంటుంది. ఈ కొత్త నిబంధనలు అన్ని యూపీఐ వినియోగదారులకు వర్తించనున్నాయి. ఇక డిజిటల్ చెల్లింపులపై ఛార్జీల అంశంపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందిస్తూ... ఉచిత సేవల స్థిరత కోసం భవిష్యత్తులో ఖర్చు పెట్టే అవకాశాన్ని ఖండించలేమన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం భరిస్తున్న సబ్సిడీ విధానం సుదీర్ఘకాలం కొనసాగదని స్పష్టం చేశారు.