yakub
రచయిత
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : తొమ్మిది మంది మృతి, 12 మందికి గాయాలు
yakub
రచయిత
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : తొమ్మిది మంది మృతి, 12 మందికి గాయాలు

అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలంలోని రెడ్డిచెరువు కట్ట వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మామిడికాయల లోడుతో వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది కూలీలు దుర్మరణం చెందగా, మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రైల్వే కోడూరు మండలంలోని శెట్టిగుంట ఎస్టీ కాలనీ, తిరుపతి జిల్లా వద్దివేడు, కల్వకుంట్ల ప్రాంతాలకు చెందిన 21 మంది కూలీలు మామిడికాయల కోత పనులకు వచ్చారు. మామిడికాయలతో కూడిన లారీలో రైల్వే కోడూరు మార్కెట్‌కు వెళ్లేందుకు బయలుదేరగా, పుల్లంపేట సమీపంలో ఉన్న రెడ్డిచెరువు కట్ట వద్ద లారీ బోల్తాపడింది. దీంతో లారీలో ఉన్న కూలీలు బరువు లోడు కిందపడటంతో విషాదం చోటుచేసుకుంది. ఘటన స్థలంలోనే ఎనిమిది మంది మృతి చెందగా, మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. పలువురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో ఎక్కువమంది గజ్జల కుటుంబానికి చెందినవారుగా గుర్తించారు.