R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
కేరళలో సంప్రదాయ వైభవంతో ఓనం వేడుకలు
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
కేరళలో సంప్రదాయ వైభవంతో ఓనం వేడుకలు

కేరళ రాష్ట్రంలో ప్రముఖ పండుగ ఓనంని ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఆగస్టు 26న ప్రారంభమైన ఈ వేడుకలు సెప్టెంబర్ 5తో ముగిశాయి. పది రోజుల పాటు కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి సాంప్రదాయ ఉత్సవాలు జరిపారు. మహిళలు ప్రత్యేకమైన కసావు స్టైల్ చీరలు ధరించి మెరిసిపోయారు. ఇళ్ల ముందు పూలతో చేసిన పూక్కలం అలరారగా, ఊయలలు ఊగుతూ, పాటలతో, నృత్యాలతో ఆనందం పంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక విందు ఓనసద్యం ఏర్పాటు చేసి, అరటి ఆకులపై పాయసం, ఊరగాయలు, అప్పడాలు, పప్పు, అన్నం, పిండివంటలు వడ్డించారు. ఏనుగుల ప్రదర్శనలు, పూల అలంకరణలు, సాంప్రదాయ ఆటలు పండుగ వాతావరణాన్ని మరింత అందంగా మార్చాయి
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi

