ritesh
రచయిత
ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు: కొత్త మార్గాల్లో ఆదాయం
ritesh
రచయిత
ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు: కొత్త మార్గాల్లో ఆదాయం

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుతో రియల్ మనీ గేమ్స్ నిషేధించబడ్డాయి. ఈ నిర్ణయం వలన చాలా గేమింగ్ కంపెనీల ఆదాయాలు తగ్గుతాయని నిపుణులు భావిస్తున్నారు. అయితే, దీనితో ఈ కంపెనీలు కొత్త వ్యూహాలను అనుసరిస్తాయని నిపుణులు చెబుతున్నారువిష్యత్తు అవకాశాలు: విదేశీ మార్కెట్లపై దృష్టి: భారతీయ గేమింగ్ కంపెనీలు విదేశాల్లో తమ వ్యాపారాన్ని విస్తరించే అవకాశం ఉంది. క్యాజువల్ గేమ్స్‌పై ఫోకస్: డబ్బులు పెట్టి ఆడే గేమ్స్ బ్యాన్ అవడం వల్ల చాలా మంది యూజర్లు ఇప్పుడు క్యాజువల్ గేమ్స్ వైపు మళ్లే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గాలు: ఈ-స్పోర్ట్స్ టిక్కెట్ల విక్రయం, వస్తువుల అమ్మకాలు (మర్చండైజ్), ప్రకటనల ద్వారా ఆదాయం పెంచుకోవడానికి కంపెనీలు ప్రయత్నించవచ్చు. భారత ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యల వల్ల యూజర్లకు సురక్షితమైన గేమింగ్ వాతావరణం ఏర్పడుతుందని గేమింగ్ నిపుణులు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో భారతీయ గేమింగ్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతుందని అంచనాలు ఉన్నాయి..