ritesh
రచయిత
పాకిస్తాన్ కొత్త రాకెట్ దళం ఏర్పాటు – ప్రధాని షెహబాజ్ ప్రకటన
ritesh
రచయిత
పాకిస్తాన్ కొత్త రాకెట్ దళం ఏర్పాటు – ప్రధాని షెహబాజ్ ప్రకటన

భారత్ "ఆపరేషన్ సిందూర్"లో క్షిపణుల బలాన్ని చూపిన తర్వాత, పాకిస్థాన్ తన రక్షణ శక్తిని పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో, ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తాజాగా "రాకెట్ ఫోర్స్" ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించబోయే ఈ ప్రత్యేక దళం పాక్ రక్షణ శక్తిని మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు.ఈ దళానికి ప్రత్యేక కమాండ్ ఏర్పాటు చేస్తారని, సంప్రదాయ యుద్ధ పరిస్థితుల్లో క్షిపణుల మోహరింపును ఇది పర్యవేక్షిస్తుందని పాక్ సైనికాధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఫోర్స్ ఏర్పాటులో భారతదేశం కూడా పరిగణనలో ఉందని ఆంగ్ల మీడియాలో వచ్చిన కథనాలు చెబుతున్నాయి.ఇంతలోనే, షెహబాజ్ భారత్‌పై బహిరంగంగా హెచ్చరికలు చేస్తూ, సింధూ నదినీటి విషయంలో రాజీ ఉండదని, న్యూఢిల్లీ ఒక్క చుక్క నీరు తీసినా సహించబోమని వ్యాఖ్యానించారు. మరోవైపు పీపీపీ నాయకుడు బిలావల్ భుట్టో, ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కూడా భారత్‌పై విమర్శలు గుప్పిస్తూ అణు బెదిరింపులకు కూడా పాల్పడ్డారు.