R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు: గెలిచినప్పుడు ఒక న్యాయం, ఓడితే మరో న్యాయమా?

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు: గెలిచినప్పుడు ఒక న్యాయం, ఓడితే మరో న్యాయమా?

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు: గెలిచినప్పుడు ఒక న్యాయం, ఓడితే మరో న్యాయమా?

కాకినాడలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. స్వాతంత్ర్యం అనేది ఎంతో మంది మహానుభావుల త్యాగఫలం అని చెప్పారు.ఇటీవల అమలులోకి వచ్చిన స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం గురించి మాట్లాడుతూ – ‘‘మహిళల కోసం ప్రత్యేకంగా ఈ పథకాన్ని ప్రారంభించాం. సూపర్ సిక్స్ హామీల్లో ఇది ఒకటి. ప్రజల ఆర్థిక భారం తగ్గించడమే లక్ష్యం’’ అని తెలిపారు.గత పాలనపై విమర్శలు చేస్తూ – ‘‘2019–2024 కాలం బ్రిటిష్ పాలనలా అనిపించింది. ఎవరైనా ప్రశ్నిస్తే ఆపకుండా అణిచేవారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ప్రజలు భయభ్రాంతుల నుంచి బయటపడ్డారు. గెలిచినప్పుడు ఓటు న్యాయం, ఓడినప్పుడు ఓటు చోరీ అన్నట్టు వ్యవహరించడం సబబు కాదు. రాష్ట్ర అభివృద్ధికి శాంతి భద్రతలు కీలకం’’ అని పేర్కొన్నారు.కూటమి ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు

LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi