yakub
రచయిత
పెర్ణి నాని వివాదాస్పద వ్యాఖ్యలు – చంద్రబాబుపై తీవ్ర విమర్శలు
yakub
రచయిత
పెర్ణి నాని వివాదాస్పద వ్యాఖ్యలు – చంద్రబాబుపై తీవ్ర విమర్శలు

పెడనలో జరిగిన వైఎస్సార్సీపీ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబుపై ఉద్దేశించి, "76 ఏళ్ల ముసలివి.. ఎంతకాలం బతుకుతావ్? 50 ఏళ్ల జగన్‌ను తుడిచిపెట్టేస్తావా?" అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబుతో పాటు లోకేశ్, వంశీ, అయ్యన్నపాత్రుడులపై కూడా ఆయన పదును పెట్టారు. తాను ఎప్పుడూ చీకట్లో దాడి చేయండని చెప్పలేదని, అయితే అవసరమైతే పట్టపగలే తానే ముందుంటానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోకేశ్ వంశీపై చేసిన వ్యాఖ్యలు, ఆయన జైలు జీవితం విషయాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు బృందంపై విరుచుకుపడ్డారు. కొడాలి నాని త్వరలో గుడివాడలో మళ్లీ అడుగుపెడతారని, దమ్ముంటే ఎదుర్కొనాలని సవాల్ చేశారు. ‘కొల్లు రవీంద్ర కాదు, సొల్లు రవీంద్ర’ అంటూ విమర్శించారు. ఆయనపై అక్రమాస్తుల ఆరోపణలు చేస్తూ, ఆధారాలతో త్వరలో బయటపెడతానని హెచ్చరించారు. మాధ్యమాలపై కూడా నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌పై డిబేట్లు పెట్టి TRPలు పెంచుకుంటున్నారంటూ మీడియాపై విమర్శలు గుప్పించారు. కూటమి నేతల వ్యాఖ్యలపై ఎందుకు చర్చలు పెట్టడం లేదంటూ ప్రశ్నించారు.