yakub
రచయిత
బీసీ బిల్లు కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్న కవిత
yakub
రచయిత
బీసీ బిల్లు కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్న కవిత

బీసీ రిజర్వేషన్ బిల్లుపై పోరాటాన్ని ముమ్మరం చేస్తామంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. జూలై 17న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ‘రైల్ రోకో’ నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ నుంచి ఢిల్లీ వెళ్లే రైళ్లను ఆపి నిరసన తెలుపనున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావుకు లేఖ రాసినట్టు చెప్పారు. బీజేపీ అధ్యక్ష హోదాలో తొలి విజయం సాధించే అవకాశం ఉందంటూ సూచించారు. కేంద్రంపై ఒత్తిడి తేవాలని కాంగ్రెస్ అధినేత మల్లిఖార్జున్ ఖర్గేకు కూడా లేఖ రాయనున్నట్టు వెల్లడించారు. కాగా, కులగణన వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆమె విమర్శించారు. బనకచర్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ తీరు అస్పష్టమని, రాష్ట్రంలో చంద్రబాబు కోవర్టులు ఉన్నట్లు అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలను ఉదహరించారు. రైల్ రోకో కార్యక్రమానికి బీఆర్ఎస్ పూర్తి మద్దతుగా ఉంటుందని స్పష్టం చేశారు. అనంతరం రైల్ రోకో పోస్టర్‌ను ఆవిష్కరించారు.