krtv
రచయిత
సంక్రాంతి బరిలోకి ప్రభాస్ – ‘ది రాజా సాబ్’ రిలీజ్ జనవరి 9కి వాయిదా!
krtv
రచయిత
సంక్రాంతి బరిలోకి ప్రభాస్ – ‘ది రాజా సాబ్’ రిలీజ్ జనవరి 9కి వాయిదా!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది రాజా సాబ్’ విడుదల తేదీ మారింది. అసలుగా ఈ సినిమాను 2025 డిసెంబర్ 5న విడుదల చేయాలని ప్లాన్ చేసినా, తాజా అప్‌డేట్ ప్రకారం షూటింగ్ కొంత వెనుకబడటంతో విడుదల వాయిదా పడింది. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ప్రకారం, సినిమాను వచ్చే ఏడాది జనవరి 9, 2026న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ మాస్ ఎంటర్టైనర్‌లో ప్రభాస్ రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడని సమాచారం. నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ధి కుమార్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. సంక్రాంతి రేస్‌లో ప్రభాస్ సినిమా ఎంట్రీతో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ కూడా సంక్రాంతికే రానుండటంతో, ఈ బాక్సాఫీస్ క్లాష్‌కి ఫ్యాన్స్ ఎక్కువ ఎక్సైట్మెంట్ కనబరుస్తున్నారు.