Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
వేలంకన్ని చర్చి, నాగూర్ దర్గాలో శోభిత ప్రార్థనలు
Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
వేలంకన్ని చర్చి, నాగూర్ దర్గాలో శోభిత ప్రార్థనలు

నటి శోభిత ధూలిపాళ్ల ఇటీవల తమిళనాడులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె వేలంకన్ని చర్చి, నాగూర్ దర్గాను సందర్శించి ప్రార్థనలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో "ఇటీవలి జీవితం" అనే హ్యాష్‌టాగ్‌తో షేర్ చేశారు. అలాగే, ఓ స్నేహితురాలి పెళ్లికి హాజరై, బీచ్ వద్ద సేదతీరి కొన్ని సందర్భాలను అభిమానులతో పంచుకున్నారు. ‘‘ఏది వచ్చినా దాన్ని స్వీకరించండి, వెళ్లిపోయినప్పుడు బాధపడకండి’’ అంటూ ఓ సందేశాన్ని కూడా పోస్టు చేశారు. సినిమాల విషయానికొస్తే, శోభిత చివరిసారిగా హాలీవుడ్ చిత్రం ‘మంకీ మ్యాన్’లో నటించారు. ఇది విదేశాల్లో విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. ఇండియాలో మాత్రం విడుదల తేదీ ప్రకటించలేదు. అలాగే జీ5 లో ‘లవ్, సితారా’ అనే చిత్రంలోనూ ఆమె నటించారు. ఆమె తదుపరి ప్రాజెక్ట్‌పై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.
ట్యాగ్‌లు
CinemaKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi