Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
దిగజారి బతకలేను, మళ్లీ త్యాగానికైనా సిద్ధం: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
దిగజారి బతకలేను, మళ్లీ త్యాగానికైనా సిద్ధం: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవికి అవకాశం ఉన్నా, మునుగోడు ప్రజల కోసమే అక్కడినుంచి పోటీ చేసినట్లు వెల్లడించారు. "పదవుల కోసం లోబడి ఉండలేను, నేను దోచుకునే నాయకుడు కాదు. మునుగోడు ప్రజల కోసం ఎప్పటికైనా త్యాగానికి సిద్ధమే. ప్రజలకే మేలు చేకూరేలా నా పదవి ఉండాలి" అని వ్యాఖ్యానించారు. పార్టీ అధిష్ఠానం ఇష్టం అయితే మంత్రి పదవి ఇస్తారని, కానీ దానికోసం కాళ్లలో పడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. "నా ప్రజల గౌరవం కోసమే నేను రాజకీయాల్లో ఉన్నాను" అని అన్నారు.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi