ritesh
రచయిత
చేప్పుల క్యూలైన్.. రైతుల ఆవేదన, పాలకులపై మండిపడ్డ కేటీఆర్
ritesh
రచయిత
చేప్పుల క్యూలైన్.. రైతుల ఆవేదన, పాలకులపై మండిపడ్డ కేటీఆర్

ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో యూరియా కొరత రైతులను ఇబ్బందుల్లోకి నెట్టింది. ఎరువుల కోసం పీఏసీఎస్ గోడౌన్ ఎదుట రైతులు గంటల తరబడి వేచిచూస్తున్నారు. కొందరు క్యూలో చెప్పులు పెట్టి తమ స్థానాన్ని నిలుపుకుంటున్నారు. ఇప్పటికే మూడు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలోనే ఇంత స్థాయిలో సమస్యలు ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. "ఇవాళ క్యూలో ఉన్న చెప్పులే.. రేపు పాలకులకు చెప్పుల దండలుగా మారతాయి," అంటూ సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. రైతులను ఈ స్థాయిలో నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల కొరత తీవ్రతరమవుతోంది. ఎరువుల డిపోల వద్ద రాత్రి నుంచే బారులు తీరుతున్నారు. ఈ పరిస్థితిపై కేంద్రం, రాష్ట్రం ఒకరిపై మరొకరు నెపం మోపుకుంటుండగా, నలిగిపోతున్నది మాత్రం రైతాంగమే.