ritesh
రచయిత
తెలుగు రాష్ట్రాల్లో చోరీల పరంపరకు చెక్ – దివ్యాంగుడిని అరెస్ట్ చేసిన రైల్వే పోలీసులు
ritesh
రచయిత
తెలుగు రాష్ట్రాల్లో చోరీల పరంపరకు చెక్ – దివ్యాంగుడిని అరెస్ట్ చేసిన రైల్వే పోలీసులు

నెల్లూరు: రాత్రిళ్లలో రైళ్లలోకి ప్రవేశించి ప్రయాణికుల నిద్రను అవకాశంగా మార్చిన ఓ దివ్యాంగుడు చివరికి పోలీసుల గప్పులో పడ్డాడు. రైళ్లలో చాకచక్యంగా చోరీలు చేస్తున్న ఈ అంతర్రాష్ట్ర నిందితుడిని నెల్లూరు రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పోలీసుల కథనం ప్రకారం, జనశతాబ్దీ ఎక్స్‌ప్రెస్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని బుధవారం అదుపులోకి తీసుకొని విచారించగా, అతడు పాత నేరస్థుడిగా తెలుస్తోంది. గతంలో హైదరాబాద్, విజయవాడ, కర్నూలు, తిరుపతి, నంద్యాల స్టేషన్ల పరిధిలో 10కి పైగా చోరీల కేసుల్లో నిందితుడిగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.నిందితుడి వద్ద నుంచి రెండు ల్యాప్‌టాప్‌లు, రెండు మొబైల్ ఫోన్లు, 143 గ్రాముల బంగారం, మొత్తం రూ.12 లక్షల విలువైన ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు. దివ్యాంగుడిగా టికెట్ తీసుకుని, రాత్రి వేళల్లో ఏసీ కోచ్‌ల్లోకి వెళ్లి నిద్రలో ఉన్న ప్రయాణికుల బ్యాగులు, వస్తువులు చోరీ చేయడం అతని మోసపు తంతు. ప్రస్తుతం నిందితుడిపై మరిన్ని కేసులు నమోదు చేసేందుకు విచారణ కొనసాగుతోంది.