R
ramya
రచయిత
1 నిమిషాలు చదవడానికి
హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాల బీభత్సం – 69 మంది మృతి
R
ramya
రచయిత
1 నిమిషాలు చదవడానికి
హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాల బీభత్సం – 69 మంది మృతి

హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలు మృత్యుదృశ్యంగా మారాయి. గత పదిహేను రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, మేఘాల విస్ఫోటనం, కొండచరియల కూలింపులతో ఇప్పటివరకు 69 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 250 రహదారులు మూసుకుపోయాయి. రూ.400 కోట్లకు పైగా ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు తెలిపారు. మండి జిల్లా వంటి ప్రాంతాల్లో ఇళ్లు నేలమట్టమవుతుండగా, వాహనాలు, తాగునీటి పథకాలు, విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నాయి. 700కి పైగా తాగునీటి ప్రాజెక్టులు నిలిచిపోయాయి. సైన్యం, NDRF, SDRF బృందాలు సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే బయటకు రావాలని ప్రభుత్వం హెచ్చరించింది. IMD జూలై 7వ తేదీ వరకు భారీ వర్షాలు కొనసాగే అవకాశముందని హెచ్చరించింది.
ట్యాగ్‌లు
LatestKranthi NewsKranthi News Telugukrtv kranthi