ritesh
రచయిత
బస్ కండక్టర్ నుంచి సూపర్ స్టార్‌గా రజనీకాంత్ 50 ఏళ్ల సినీ ప్రయాణం
ritesh
రచయిత
బస్ కండక్టర్ నుంచి సూపర్ స్టార్‌గా రజనీకాంత్ 50 ఏళ్ల సినీ ప్రయాణం

భారత సినీ రంగంలో అరుదైన గుర్తింపు తెచ్చుకున్న నటుడంటే అది రజనీకాంత్. ఆయనకు ఉన్న అభిమాన స్థాయి దక్షిణాదినే కాదు, ఉత్తరాదిన కూడా అంతేగా ఉంటుంది. చిన్నవారి నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకునే ఆయన స్టైల్, డైలాగ్ డెలివరీ, మాస్ ప్రెజెన్స్ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. గత 50 ఏళ్లుగా అదే ఇమేజ్ కొనసాగించడంలో ఆయన ప్రత్యేకత ఉందని చెప్పాలి.1975లో దర్శకుడు కె. బాలచందర్ తెరకెక్కించిన అపూర్వ రాగంగళ్ సినిమాతో రజనీకాంత్‌కి సినీ రంగ ప్రవేశం జరిగింది. అప్పట్లో బెంగళూరులో బస్ కండక్టర్‌గా పనిచేస్తున్న రజనీ టాలెంట్‌ను గుర్తించిన బాలచందర్ ఆయనకు సినిమా అవకాశమిచ్చారు. మొదటి చిత్రంలో చిన్న పాత్రే అయినా, రజనీకాంత్ స్క్రీన్ ప్రెజెన్స్ చూసినవాళ్లు మెచ్చుకోకుండా ఉండలేకపోయారు.ఆ తరవాత వచ్చిన 'మూండ్రు ముడిచ్చు', '16 వయతినిలే' వంటి సినిమాల్లో విలన్ పాత్రలతో ప్రేక్షకుల దృష్టిని మరింతగా ఆకర్షించారు. కానీ 'భైరవి' సినిమాతో సోలో హీరోగా మారిన రజనీకాంత్, అప్పటి నుంచే "సూపర్ స్టార్" అని పిలవబడతారు.