Y

yakub

రచయిత

1 నిమిషాలు చదవడానికి

రాఖీ పండుగ రద్దీతో హైదరాబాద్‌లో బస్టాండ్లలో సందడి

రాఖీ పండుగ రద్దీతో హైదరాబాద్‌లో బస్టాండ్లలో సందడి

రాఖీ పండుగ రద్దీతో హైదరాబాద్‌లో బస్టాండ్లలో సందడి

రాఖీ పండుగను పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఆర్టీసీ బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. సోదరులకు రాఖీ కట్టేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో పుట్టిన ఊర్లకు బయలుదేరుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ‘రాఖీ సర్వీసులు’ నడిపిస్తోంది. అయితే ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉండడంతో డీలక్స్‌, సూపర్ లగ్జరీ బస్సులన్నీ ముందుగానే రిజర్వేషన్‌ అయిపోయాయి. దీంతో టికెట్లు దొరకకపోవడంతో చాలామంది ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. బస్సుల కొరత కారణంగా నడిపే ప్రతి బస్సు పూర్తిగా నిండిపోయే పరిస్థితి నెలకొంది. రాబోయే రెండు రోజుల పాటు ఇదే తరహా రద్దీ కొనసాగే అవకాశం ఉంది.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthitelagnanahyderabad